శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతోన్న బయోగ్రాఫికల్ డ్రామా ‘అమరన్’. అశోకచక్ర మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నాడు. ఆద్యంతం మిలటరీ బ్యాక్‌డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలవుతోంది.
తాజాగా.. ఈ చిత్రం నుంచి సాయిపల్లవి పోషిస్తున్న ఇందు రెబెకా వర్గీస్ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. మేజర్ ముకుంద వరదరాజన్ భార్య ఇందు రెబెకా పాత్రలో సాయిపల్లవి కనిపించబోతుంది. ఇతర ప్రధాన పాత్రల్లో భువన్ అరోరా, రాహుల్ బోస్ కనిపించబోతున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.