HomeMoviesటాలీవుడ్అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న 'రాయన్'

అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న ‘రాయన్’

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించి, నటించిన మూవీ ‘రాయన్’. ధనుష్ హీరోగా నటించిన 50వ చిత్రమిది. జూలై 26న థియేటర్లలో విడుదలైన ‘రాయన్’ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్లు వసూళ్లు సాధించింది.’రాయన్’ చిత్రంలో సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, జయరామ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్ కుమార్, శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని సంగీతం, నేపథ్య సంగీతానికి మంచి పేరొచ్చింది. స్వర సామ్రాట్ ఎ.ఆర్.రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

థియేటర్లలో విడుదలైన 28 రోజులకే ఓటీటీ లోకి వచ్చేస్తుంది ‘రాయన్’. ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘రాయన్’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళంతో పాటు.. కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ‘రాయన్’ స్ట్రీమింగ్ కానుంది.

ఇవీ చదవండి

English News