HomeMoviesటాలీవుడ్రామన్న యూత్ ట్రైలర్.. ఎలా ఉంది..

రామన్న యూత్ ట్రైలర్.. ఎలా ఉంది..

-

పెళ్లి చూపులు సినిమాతో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్. తర్వాత అభయ్ నవీన్ గా తన పేరు మార్చుకున్నాడు. పెళ్లి చూపులు ఫేమ్ తో మరికొన్ని సినిమాల్లో నటించాడు. కానీ పెద్దగా బ్రేక్ వచ్చిందని చెప్పలేం. బట్ ఓ వైపు నటుడుగా ఆకట్టుకుంటూనే అతను మెగాఫోన్ పట్టుకున్నాడు. తను చూసిన, తెలుసుకున్న అంశాలతో విలేజ్ బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ ను మేళవించి ఓ కథ రాసుకున్నాడు. ఆ కథతో దర్శకుడయ్యాడు.

చాలా రోజుల క్రితమే ఈ మూవీ రెడీ అయింది. కొత్తవాళ్లు కావడం.. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల విడుదల బాగా ఆలస్యం అయింది. బట్ ఫైనల్ గా ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా రామన్న యూత్ మూవీ ట్రైలర్ ను హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా విడుదల చేశారు.


నిజానికి ఈ మూవీకి సంబంధించి కొన్నాళ్ల క్రితమే చాలామందికి ప్రివ్యూస్ వేశారు. ఆ ప్రివ్యూస్ చూసిన వాళ్లంతా మంచి కంటెంట్ ఎంచుకున్నారు.. బాగా తీశారు అని టీమ్ మొత్తాన్ని బాగా అప్రిసియేట్ చేశారు. అది నిజమే అనేలా ఉందీ ట్రైలర్. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకులు ఇచ్చే చిన్న చిన్న తాయిలాలకు ఆశపడి తమ జీవితాలను, కెరీర్ ను ఎలా లాస్ అవుతారు. ఆ నాయకుల కోసం ఊరిలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటారు అనే కోణంలో రాజకీయ నాయకులు, స్వార్థపరుల వల్ల గ్రామీణ రాజకీయాలు, యువత ఎలా చెడిపోతున్నారు అనే అంశాలను ఎంటర్టైనింగ్ గాచెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాను వీళ్లు చాలా హానెస్ట్ గా రూపొందించినట్టు అర్థం అవుతుంది.


దర్శకత్వం చేస్తూనే తనే ప్రధాన పాత్రలోనూ కనిపించాడు నవీన్. అమూల్య రెడ్డి ఫీమేల్ లీడ్ లో కనిపించింది. అతనితో పాటు దాదాపు కొత్తవాళ్లు, డిజిటల్ మీడియాలో కాస్త ఫేమ్ ఉన్నవాళ్లను తీసుకున్నాడు. వీరిలో అనీల్ గీల, విష్ణు వంటి వారితో పాటు సీనియర్స్ అయిన తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటివారూ ఉన్నారు. మరి వీరి హానెస్ట్ అటెంప్ట్ కు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ నెల 15న తెలిసిపోతుంది.

ఇవీ చదవండి

English News