కెరీర్ స్పాన్ విషయంలో ఇప్పుడు హీరోలకు దీటుగా పోటీపడుతున్నారు హీరోయిన్స్. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. పేరుకు ఉత్తరాది అయినా.. దక్షిణాది చిత్ర సీమతోనే సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది రకుల్ ప్రీత్ సింగ్. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లీ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ కి.. 2011లో ‘కెరటం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ స్వాగతం పలికింది. అయితే.. ఈ ఢిల్లీ బ్యూటీకి తొలి విజయాన్నందించిన చిత్రం మాత్రం ‘వెంటాద్రి ఎక్స్ ప్రెస్’. ఈ సినిమా తర్వాత తెలుగులోనే హీరోయిన్ గా సెటిలైపోయింది.

తక్కువ సమయంలోనే తెలుగులో అగ్ర పథానికి దూసుకెళ్లింది రకుల్ ప్రీత్ సింగ్. అనతి కాలంలోనే ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్ వంటి హీరోలను కవర్ చేసింది. అటు తమిళంలోనూ ‘దేవ్’, ‘ఎన్.జి.కె’ వంటి చిత్రాలలో మెరిసింది. ఇక.. దక్షిణాదిన అగ్రపథాన దూసుకెళ్తున్న సమయంలో.. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అదే రకుల్ వేసిన రాంగ్ స్టెప్ అంటారు కొంతమంది విశ్లేషకులు.

రకుల్ బాలీవుడ్ ఆశలు అడియాశలే అయ్యాయి. బీటౌన్ లో చేసిన ‘దేదే ప్యార్ దే’ తప్ప.. మిగతా ‘అయ్యారీ’, ‘మర్జవాన్’, ‘షిమ్లా మిర్చి, సర్దార్ కా గ్రాండ్ సన్, థ్యాంక్ గాడ్, ఛత్రీవాలి’ వంటి సినిమాలు ఫ్లాపుల బాట పట్టాయి. అయితే మధ్యలో ‘ఎటాక్, డాక్టర్ జీ‘ వంటి సినిమాలు ఫర్వాలేదనిపించినా.. భారీ వసూళ్లు మాత్రం సాధించలేకపోయాయి. ప్రస్తుతం హిందీలో ఒకటీ అరా సినిమాలు చేస్తున్నా.. రకుల్ మళ్లీ సౌత్ నుంచి వస్తోన్న సినిమాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. తమిళంలో రకుల్ నటిస్తున్న ‘అయలాన్, ఇండియన్ 2‘పై మంచి అంచలున్నాయి. కొంతకాలంగా డల్ గా సాగుతోన్న రకుల్ కెరీర్ మళ్లీ ఈ సినిమాలతో పుంజుకుంటుందేమో చూడాలి. అక్టోబర్ 10న, రకుల్ బర్త్ డే.. ఈ సందర్భంగా రకుల్ కి బర్త్ డే విషెస్ చెబుదాం.