సూపర్ స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘కూలీ’. రజనీకాంత్ 171వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ సమయంలోనే రిలీజైన స్పెషల్ టైటిల్ గ్లింప్స్ తో ‘కూలీ’ చిత్రం ఎంత స్టైలిష్ గా ఉండబోతుంది? అనే హింట్ ఇచ్చాడు స్టైలిష్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనకరాజ్.
‘కూలీ’ సినిమాలో శ్రుతి హాసన్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మెగా ప్రాజెక్ట్ లోకి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఎంటరయ్యాడు. ఉపేంద్ర ఆన్‌బోర్డులోకి వచ్చినట్టు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ‘కూలీ’ సినిమాలో ఉపేంద్ర ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం ఉంది.
ఇటీవలే ‘కూలీ’ సినిమా వైజాగ్ లో థర్డ్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టుకుంది. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందట. ఇక్కడ సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘కూలీ’ సెట్ లో తమిళ, కన్నడ సూపర్ స్టార్స్ రజనీకాంత్, ఉపేంద్ర ఇద్దరూ కలిసున్న స్టిల్ మరొకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. వచ్చే పొంగల్ బరిలో ‘కూలీ’ విడుదలకు ముస్తాబవుతోంది.