కొన్ని కాంబినేషన్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవి నిజమవుతాయా కాదా అనేది పక్కన బెడితే ఆ రూమర్ కూడా క్రేజీగా ఉంటుంది. అలాంటి ఓ రూమరే ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ పరిశ్రమల్లోనూ వినిపిస్తోంది. అది కూడాఈ మూడు భాషల టాప్ స్టార్స్ గురించి కావడంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కన్నడ పరిశ్రమలో ఏ హర్ష అని ఓ దర్శకుడు ఉన్నాడు. అక్కడ ఇండస్ట్రీ హిట్సేం కొట్టలేదు కానీ.. కమర్షియల్ గా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అని పేరుంది.

కన్నడ హీరోల నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో అంత వరకూ తీయగల సమర్థుడుగా పేరు తెచ్చుకున్నాడు. శివరాజ్ కుమార్ తోనే నాలుగు సినిమాలు తీసిన ఈ దర్శకుడు రీసెట్ గా ఆయనతోనే చేసి వేద కన్నడలో సూపర్ హిట్ అయింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు శివన్న తన సొంత బ్యానర్ లో ఈ దర్శకుడుతో ఓ భారీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేశాడు అంటున్నారు.


రీసెంట్ గా ఎన్టీఆర్ శతజయంతి సభకోసం హైదరాబాద్ వచ్చినప్పుడు శివరాజ్ కుమార్ తను బాలయ్యతో సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు. అది ఈ ప్రాజెక్టే అంటూ ఇప్పుడు వార్తలు ఊపందుకున్నాయి. ఏ హర్ష చెప్పిన ఓ కథ మల్టీవర్స్ లా ఉంటుందట.

ఫస్ట్ పార్ట్ లో శివరాజ్ కుమార్, సెకండ్ పార్ట్ లో బాలయ్య, థర్డ్ పార్ట్ లో రజినీకాంత్ లు ఆ పాత్రలు చేయబోతున్నారనీ.. మూడో భాగం సెకండ్ హాఫ్ నుంచి మిగతా రెండు పాత్రలూ యాడ్ అవుతాయిన అనేది దీనికి కొత్తగా కలిపిన పులిహోర.

అయితే శివరాజ్ కుమార్.. బాలయ్యతో సినిమా చేయడం మాత్రం పక్కా. కాకపోతే అది ఇలా మల్టీవర్స్ గా ఉంటుందనే వార్తే.. కాస్త అతిగా ఉంది. కాదూ ఇది నిజమే అంటారా.. ఇంక చెప్పేదేముందీ.. మూడు భాషల్లోనూ బాక్సాఫీస్ కు దబడిదిబిడే.

, , , , , , , , , ,