మహేష్ కి విలన్ ను సెట్ చేసిన రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందే సినిమా ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ దశలో ఉంది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇండియా నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీ ఇది. ఈ సినిమాకోసం ఇప్పటికే సూపర్ స్టార్.. సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ఇంకా.. ఈ అడ్వంచరస్ థ్రిల్లర్ కోసం రిగరస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఈ మూవీకోసం మహేష్ బాబుకి దీటైన విలన్ ను సెట్ చేశాడట రాజమౌళి.

మాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో పృథ్వీరాజ్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో నటించేందుకు కొంతకాలంగా పృథ్వీరాజ్ తో చర్చలు జరిపాడట జక్కన్న. ఈ మూవీలోని తన పాత్రను తీర్చిదిద్దిన విధానానికి ఫిదా అయిన పృథ్వీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరో అంటే మహేష్ బాబు. అలాగే.. మలయాళంలో అందమైన హీరోగా పృథ్వీరాజ్ కు పేరుంది. ఇలాంటి ఇద్దరు అందగాళ్లు ఒకే ఫ్రేములో తలపడితే ఎలాగుంటోంది? అనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. మరోవైపు.. ఇప్పటికే ప్రభాస్ ‘సలార్’తో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించాడు పృథ్వీరాజ్. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్ గానూ పృథ్వీరాజ్ కి మంచి పేరుంది. మొత్తంమీద.. త్వరలోనే రాజమౌళి-మహేష్ మూవీలో పృథ్వీరాజ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానుందట.

Related Posts