సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాకోసం లొకేషన్స్ హంటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు దర్శకధీరుడు రాజమౌళి. తాజాగా.. ఆఫ్రికా అడవుల్లో SSRMB కోసం లొకేషన్స్ వేట కొనసాగిస్తున్నాడు. ఈకోవలోనే.. కెన్యాలోని ఓ నేషనల్ పార్క్ లో అడవి జంతువుల మధ్య తిరుగుతున్న ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు జక్కన్న.
మహేష్ బాబు సినిమా ఆద్యంతం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాలో నటీనటులతో పాటు.. చాలా జంతువులు కూడా కనిపించనున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్‘ కోసం సింహం, పులి వంటి యానిమల్స్ ను రాజమౌళి చూపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్‘కి కొన్ని రెట్లు మించిన బడ్జెట్ తో రూపొందే ఈ మూవీలో జంతువులకు సంబంధించిన ఎపిసోడ్స్ ఎంతో అడ్వంచరస్ గా ఉంటాయట.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఇంకా.. ఇంటర్నేషనల్ గా చాలా మంది టాప్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా మొదలు పెట్టనున్నారు.