నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’ విడుదల తేది ఖరారైయింది. ఈ చిత్రం వేసవిలో ఏప్రిల్ 14, 2023న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో లారెన్స్ తలకు గాయంతో రగ్గడ్ అవతార్‌లో కనిపించారు.ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు.  ‘ఈవిల్ ఈజ్ నా బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.సినిమా విడుదల తేదిని తెలియజేస్తూ దర్శక, నిర్మాత కతిరేసన్ ప్రకటన చేశారు. “ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ నుండి పొల్లాధవన్, ఆడుకాలం, జిగర్తాండ, డైరీ విజయవంతమైన బ్లాక్‌బస్టర్స్ వరుసలో మా తదుపరి ప్రాజెక్ట్  రాఘవ లారెన్స్ మాస్టర్‌ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ‘రుద్రుడు’.

రాఘవ లారెన్స్ మాస్టర్ కాంచన-3 విడుదలై దాదాపు మూడు సంవత్సరాల తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించదానికి మా వంతు గొప్ప కృషి చేస్తున్నాం. రుద్రుడు’ ముందుగా థియేటర్లలో క్రిస్మస్ విడుదలకు ప్రకటించినప్పటి వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కావడనికి మరికొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ 14.04.2023న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకులు ఆదరించి మరో బ్లాక్ బస్టర్ విజయం ఇవ్వాలని కోరుతున్నాం. రుద్రుడు మిమ్మల్ని ఏప్రిల్ 2023లో థియేటర్లలో కలుస్తాడు” అని  కతిరేసన్  పేర్కొన్నారు.ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.