ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 17న సాయంత్రం 6:03 కి ‘పుష్ప 2’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ ను పాట్నా వేదిక గా విడుదల చెయ్యబోతుండడం విశేషం.
ఇటీవలే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ టీజర్ ను లక్నో లో రిలీజ్ చేసారు. ఇప్పుడు బన్నీ పుష్ప 2 కోసం పాట్నా ను ఎంచుకోవడం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పాట్నా లో గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ ఏర్పాటు చేసి ఈ ట్రైలర్ ను ఘనంగా లాంఛ్ చేయనున్నారు.