స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన చిత్రం ‘పుష్ప‘. గత కొన్నేళ్లుగా ‘పుష్ప‘రాజ్ గెటప్ లోనే ఉండిపోయాడు బన్నీ. ఈ సిరీస్ లో వచ్చిన ఫస్ట్ పార్ట్ ‘పుష్ప.. ది రైజ్‘ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ ‘పుష్ప.. ది రూల్‘ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈరోజు పాట్నా వేదికగా ‘పుష్ప 2‘ మేజర్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో ది మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ రిలీజవుతుంది.
ట్రైలర్ లాంఛ్ కోసం అల్లు అర్జున్ పాట్నా వెళ్లాడు. పాట్నా వెళుతుండగా ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ విజువల్స్.. హీరోయిన్ రష్మిక తో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకూ మన తెలుగు సినిమాల కోసం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఈవెంట్స్ నిర్వహించేవారు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లోనూ భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఓ తెలుగు సినిమాకోసం బీహార్ రాజధాని పాట్నాలో ఇలాంటి పెద్ద వేడుక చేయడం ఇదే తొలిసారి.
మన స్టార్ హీరోల ఈవెంట్స్ కు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఏ రీతిన హంగామా చేస్తారో.. ఇప్పుడు పాట్నాలోనూ ‘పుష్ప 2‘ కోసం ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. భారీ జన సందోహం మధ్య అంగరంగ వైభవంగా పాట్నాలో ‘పుష్ప 2‘ ట్రైలర్ లాంఛ్ జరగబోతుంది.