HomeMoviesటాలీవుడ్'పుష్ప 2'.. నెల రోజుల ముందుగానే టికెట్ బుకింగ్స్!

‘పుష్ప 2’.. నెల రోజుల ముందుగానే టికెట్ బుకింగ్స్!

-

‘పుష్ప.. ది రూల్’తో బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ నటించిన ‘పుష్ప.. ది రైజ్’ భారీ విజయాన్ని సాధించడంతో ‘పుష్ప 2’పై అభిమానుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.

విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ‘పుష్ప 2’.. విడుదల తర్వాత కలెక్షన్ల మోత మోగించడానికి ముస్తాబవుతుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలకానున్న ‘పుష్ప 2’కి సంబంధించి నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించబోతున్నారు. నార్త్ అమెరికాలో నవంబర్ 5 నుంచే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి నార్త్ అమెరికా నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. ‘దేవర’ విడుదలకు చాలా రోజుల ముందుగానే అమెరికాలో బుకింగ్స్ ప్రారంభించారు. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ‘దేవర’ చిత్రం విడుదలకు ముందే మిలియన్ల డాలర్లు కొల్లగొట్టింది. ఇదే ఫార్ములాని ‘పుష్ప 2’కి అప్లై చేస్తున్నారు. మరి.. ఎంతో బజ్ తో రాబోతున్న ‘పుష్ప 2’ నార్త్ అమెరికాలో ఎన్ని మిలియన్ డాలర్లు కొల్లగొడుతుందో చూడాలి.

ఇవీ చదవండి

English News