మారేడు మిల్లిలో పుష్ప 2 సందడి.. కలిసొచ్చిన సమ్మర్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పుష్ప సీక్వెల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫస్ట్ పార్ట్ లాగానే రెండో భాగాన్ని కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ చేస్తున్నారు. మొన్నటి వరకూ ఈ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు. అది కూడా బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ తో కవర్ చేస్తూ గ్రాఫిక్స్ లో అడవిని క్రియేట్ చేయాలనుకున్నారు. అందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం సమ్మర్ కావడమే.

ఈ వేసవిలో ఎంత పెద్ద అడవి అయినా.. డ్రై గా కనిపిస్తుంది. ఆకులన్నీ రాలిపోయి.. చెట్లన్నీ మోడువారినట్టుగా ఉంటాయి. బట్ పుష్ప కోసం దట్టమైన అడవి కావాలి కదా.. ? అందుకే సెట్స్ లో షూట్ చేశారు. అలాగని పూర్తిగా ఇన్ హౌస్ లోనే చేయలేరు కదా..? మరి బయటకు రావాలంటే దట్టమైన అడవి కావాలి. బట్ వీరికి అదృష్టం కలిసొచ్చింది. ఇంత మండు వేసవిలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి.

ముఖ్యంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఇప్పుడు వర్షాకాలాన్ని తలపిస్తోంది. దీంతో చెట్లన్నీ పచ్చబడ్డాయి. మామూలుగా ఇలాంటి వెదర్ వర్షాకాలం పోయి చలికాలం వచ్చినప్పుడు కనిపిస్తుంది. బట్ ఇంత ఎండల్లో అదే వెదర్ కనిపిస్తుండటంతో షూటింగ్ కు మారేడుమిల్లికి షిఫ్ట్ చేశారు.


మారేడుమిల్లీ అడవుల్లో కొన్ని కీలకమై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు సుకుమార్ . వీటిలో ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్ ఉన్న సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. ఫహాద్ శెకావత్ అనే కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఫస్ట్ పార్ట్ చివర్లో ఎంటర్ అయిన ఈ పాత్ర ఈ సారి ఓ రేంజ్ లో ఉంటుందని టాక్.

ఇక ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన వేరీజ్ పుష్ప అనే వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. రావడమే కాదు.. అంచనాలను డబుల్ చేసింది. ఇంతకు ముందు శేషాచలం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మాత్రమే ఉంటే.. ఈ సారి స్పాన్ మరింత పెరుగుతుందని ముందే చెప్పారు.

మొత్తంగా ఫస్ట్ పార్ట్ 2021 డిసెంబర్ 17న విడుదల చేశారు. ఈ పార్ట్ ను కూడా దాదాపు అదే డేట్ కు దగ్గరగా ఈ యేడాది డిసెంబర్ 16న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సారి పుష్ప రూలింగ్ ఎట్టా ఉంటుందో సూడాల.

Related Posts