సూపర్ హీరోతో ఫిక్సైన పూరి జగన్నాథ్

టాలీవుడ్ లో జెట్ స్పీడులో సినిమాలను పూర్తి చేసే డైరెక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒక్కసారి పూరి తో సినిమా చేసిన ఏ హీరో అయినా.. మళ్లీ మళ్లీ అతనితో పనిచేయాలని ఆసక్తి చూపిస్తుంటారు. హీరోలకు మాస్ ఇమేజ్ ను అందించడంలో సిద్ధహస్తుడైన పూరి జగన్నాథ్ కి.. ‘లైగర్’ రూపంలో బడా ఫ్లాప్ వచ్చింది. దీంతో.. మళ్లీ ట్రాక్ పైకి వచ్చేందుకు ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’తో రెడీ అవుతున్నాడు. రామ్ బర్త్ డే స్పెషల్ గా మరికొన్ని గంటల్లో ఈ మూవీ నుంచి టీజర్ రాబోతుంది.

‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత పూరి జగన్నాథ్ చేయబోయే సినిమా ఏంటి? అనేది ఇప్పుడు ఫిల్మ్ లవర్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఎప్పుడూ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో రెండు, మూడు ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టేవాడు పూరి. కానీ.. ‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. లేటెస్ట్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత పూరి జగన్నాథ్ చేయబోయే సినిమాపై ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

‘హనుమాన్’తో అసలు సిసలు ఇండియన్ సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జతో తన తర్వాతి సినిమాని చేయనున్నాడట పూరి జగన్నాథ్. ‘హనుమాన్’ తర్వాత ‘మిరాయ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు తేజ సజ్జ. అశోకుడి కాలం నాటి కథతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేయనున్నాడట తేజ సజ్జ. త్వరలోనే.. ఈ మూవీపై అధికారిక ప్రకటన రానుందట.

Related Posts