అనుష్కకు ప్రభాస్ విషెస్

డార్లింగ్ స్టార్ ప్రభాస్, అనుష్క కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పేదేముందీ. మిర్చీ నుంచీ ఈ ఇద్దరు అభిమానులకు కూడా హాట్ ఫేవరట్ అయిపోయారు. బాహుబలి చూసిన తర్వాత ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు ఇద్దరూ కొట్టిపడేస్తూ వచ్చారు. తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఖండించారు.

బట్ ఇప్పటికీ అభిమానుల్లో చాలామంది వారు పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకుంటూ ఉండటం విశేషం. ఆ విషయం ఎలా ఉన్నా.. వీరిద్దరూ ఒకరి సినిమాలను ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పుకోవడం మాత్రం ఆపరు.

అలాగే ఇప్పుడు అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ పై ప్రభాస్ రియాక్ట్ అయ్యాడు. ఓ రకంగా అనుష్క డేరింగ్ గా చేసిన ప్రాజెక్ట్ ఇది. బట్ కంప్లీట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అందుకే అందరికీ నచ్చింది.మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది.


ప్రభాస్ పెట్టిన పోస్ట్ లో ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ చూస్తున్నంత సేపూ నవ్వాపుకోలేకపోయాను. స్వీటీ, నవీన్ అదరగొట్టారు.సెప్టెంబర్ 7న వస్తోన్న ఈ మూవీ మొత్తానికి నా బెస్ట్ విషెస్.. ” అని ఉంది. మొత్తంగా ప్రభాస్ .. అనుష్కకు సంబంధించిన ఏ అప్డేట్ ను మిస్ కాడు అని మరోసారి తెలిసిపోయింది. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా స్వీటిని ఓన్ చేసుకుని థియేటర్స్ కు వస్తారేమో చూడాలి.

Related Posts