పఠాన్ డైరెక్టర్ ను పక్కన బెట్టిన ప్రభాస్

ప్రభాస్.. ఇప్పుడు జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. ఒక్కో ప్రాజెక్ట్ కంట్రీని షేక్ చేసేదే. అయితే కొన్నాళ్లుగా విజయ జీవం లేని బాలీవుడ్ కు పఠాన్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త కొన్ని రోజుల క్రితం చక్కర్లు కొట్టాయి. పైగా ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసింది మైత్రీ మూవీస్ కావడంతో ఈ కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యారెంటీ అనుకున్నారు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్.

బట్ లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ను ప్రభాస్ పక్కన బెట్టాడు అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని వార్ కుసీక్వెల్ గా ప్లాన్ చేయాలనుకున్నాడు సిద్ధార్థ్ ఆనంద్. అనూహ్యంగా ఆ ఫ్రాంచైజీ నుంచి అతను తప్పుకున్నాడు. దీంతో అదే చిత్రాన్ని హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ హీరోలుగా మరో దర్శకుడు చేస్తున్నాడు.

ఇటు ఒకవేళ వార్ సిద్ధార్థ్ చేతిలోనే ఉన్నా.. మరో బాలీవుడ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ప్రభాస్ ఇష్టపడలేదని టాక్.దీంతో మరో కథ కోసం ప్రయత్నించారు. ఆ ప్రయత్నించిన కథలేవీ ప్రభాస్ కునచ్చలేదు. దీంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టేసి.. ఎవరి పనులు వారు చూసుకోవాలని నిర్ణయించకున్నారట. అంటే ఇప్పట్లో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయడం లేదు అనేది కన్ఫార్మ్ అయింది.ఇటు తెలుగులో జూన్ 16న ఆదిపురుష్‌ వస్తోంది.

ఆ తర్వాత సెప్టెంబర్ 28న మోస్ట్ అవెయిటెడ్ మూవీ సలార్ వస్తోంది. అటుపై వచ్చే సంక్రాంతి బరిలో ప్రాజెక్ట్ కే ఉంది. అలా కేవలం ఏడు నెలల కాలంలోనే మూడు బిగ్గెస్ట్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు డార్లింగ్. అటు మారుతి డైరెక్షన్ లోనూ ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్ కు విడుదల చేస్తారట. మొత్తంగా సిద్ధార్థ్ ఆనంద్ కు ప్రభాస్ నో చెప్పాడు.. అదీ మేటర్

Related Posts