ఇటలీ లొకేషన్స్‌లో ప్రభాస్‌ ‘కల్కి 2898 AD’ సాంగ్‌ షూట్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నుంచి సినిమా వస్తోందంటే పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ షేక్‌ అవడం ఖాయం. సినిమా హిట్ కాకపోయినా.. కలెక్షన్ల మోత మోగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోతున్న కల్కి మూవీపై అంచనాలకైతే హద్దే లేదు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ నుంచి అద్దిరిపోయే అప్‌డేట్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది.


ఈ మూవీ సాంగ్‌ షూటింగ్ కోసం ఇటలీ కి వెళ్లింది చిత్రయూనిట్. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీ పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు.
టీజర్‌ గ్లింప్స్‌తో పాటు శాన్‌డియోగో కామిక్‌ – కాన్‌లో సంచలనం సృష్టించింది కల్కి 2898 AD.
మైథాలజీ టచ్‌ ఉన్న ఈ సినిమా ఓ అద్భుత దృశ్యకావ్యంగా రూపొందుందనేది అందరి నోటా వినిపిస్తున్న మాట. మే 9 , 2024 లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది.

Related Posts