HomeMoviesటాలీవుడ్పవన్ పాటకు ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అట!

పవన్ పాటకు ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అట!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. ఇండస్ట్రీలోని ప్రతి మ్యూజిక్ డైరెక్టర్‌ వర్క్‌పై ఫోకస్ పెడుతూ.. తన సినిమాల్లోని పాటల గురించి ప్రభాస్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాడట. అలాగే.. మిగతా హీరోల పాటలను బాగా ఇష్టపడుతుంటాడు రెబెల్ స్టార్. లేటెస్ట్ గా ఓ ప్రోగ్రామ్ లో తనకు నచ్చిన పాటల గురించి వివరించాడు. ముఖ్యంగా సీతారామశాస్త్రి రాసిన పాటల్లో ‘జల్సా‘ చిత్రంలోని ‘ఛలోరే ఛలోరే ఛల్‘ తనకు ఎంత ఇష్టమో ఈ కార్యక్రమంలో తెలియజేశాడు.

పవన్ కళ్యాణ్ ‘జల్సా‘ సినిమాలోని ‘ఛలోరే ఛలోరే ఛల్‘ పాట గురించి వివరిస్తూ.. ఈ సాంగ్ పెప్పీగా ఉంటుంది.. మంచి ఫిలాసఫీతో హైలో ఉంటూ బాగుంటుందని అన్నాడు. అలాగే.. ఈ పాటను తాను ఎంతగా ఆరాధిస్తానో చెప్పలేనని, ఫ్రెండ్స్‌తో పాటు అందరినీ పిలిచి ఆ పాట మీనింగ్ ఎలా ఉందో వినాలని చెబుతుండేవాడినని ప్రభాస్ అన్నాడు. ఈ పాటపై తన పిచ్చి చూసి కొన్నిసార్లు ఫ్రెండ్స్ పారిపోయేవారని ప్రభాస్ చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతుంది.

ఇవీ చదవండి

English News