ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ మొదలుపెట్టారు

అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి సరైన అప్డేట్ లేకపోతే అభిమానులు ఒకప్పటిలా ఊరుకోవడం లేదిప్పుడు. నిర్మాణ సంస్థలను నిలదీస్తున్నారు. సినిమా గురించి విశేషాలను చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అప్పటికీ వినకపోతే తిట్ల దండకం అందుకుంటున్నారు. ఇంకొందరు సంస్కారవంతంగా హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తూ వెళుతున్నారు. ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పాలి.

వీళ్లు అప్పట్లో రాధేశ్యామ్ కోసం యూవీ క్రియేషన్‌స్ బ్యానర్ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఆ ఆఫీస్ ముందుకు వెళ్లి ధర్నాలూ చేశారు. అప్డేట్స్ లేకపోతేనే అలా చేస్తే రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చిన సినిమా గురించి ఏమీ చెప్పకపోతే ఇంకెలా ఉంటుంది..? అదే జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నా ఏ ప్రమోషనల్ యాక్టివిటీ కానీ.. సినిమా నుంచి అప్డేట్ కానీ లేదని కోపం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అప్డేట్ కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు.


నిజానికి సలార్ రిలీజ్ కు చాలా టైమ్ ఉంది. పోనీ అభిమానులను ఆనందం చేయించడానికి ఏవైనా పాటలు విడుదల చేద్దామా అంటే.. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఇందులో పాటలేం ఉండవట. ఉన్నవి కూడా మాంటేజ్ సాంగ్స్ లా ఉంటాయంటున్నారు. ప్రభాస్ డ్యాన్స్ చేస్తూనో.. ప్రేమ గీతాలు పాడుతూనే కనిపించేవి లేవు. అందువల్ల పాటలు విడుదల చేసే పరిస్థితి లేదు. టీజర్ లాంటిది ఏదైనా అప్పుడే వస్తే.. బిజినెస్ పై ప్రభావం చూపిస్తుంది. వీళ్లేమో భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వాళ్ల అంచనాలు నిజం కావాలంటే వేచి చూసేలా చేయాలి. అదే సలార్ మేకర్స్ చేస్తున్నారు. అది ఫ్యాన్స్ కు అవసరం లేదు. రిలీజ్ కు దగ్గరపడుతున్నా.. మా అన్న సినిమా గురించిఏం చెప్పడం లేదు. అందువల్ల క్రేజ్ తగ్గుతుందేమో వారి భావన.


అందుకే ఇప్పుడు పాత అస్త్రం బయటకు తీస్తున్నారు. వేక్ అప్ టీమ్ సలార్( #WakeUpTeamSALAAR) అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. దీని వల్ల విషయం ఖచ్చితంగా మేకర్స్ వరకూ చేరుతుంది. ఆ తర్వాత వారి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే సరే. లేదంటే ప్రశాంత్ నీల్ ఇంటి ముందు ధర్నాకు దిగినా ఆశ్చర్యం లేదు.

Related Posts