ఓటీటీలోకి మరో తెలుగు మూవీ నేరుగా వచ్చేస్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పేరు ‘పోతుగడ్డ‘. లవ్ స్టోరీకి పొలిటికల్ గేమ్ ను జోడించి రక్ష వీరమ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆడుకాలమ్ నరేన్, శత్రు, ప్రశాంత్ కార్తీ, వెంకీ, మల్లిడి రవి ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.
అనుపమ చంద్ర కోడూరి, డాక్టర్ జి.శరత్ చంద్ర రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ‘పోతుగడ్డ‘ సినిమా నవంబర్ 14 నుంచి ఈటీవి విన్ ఒరిజినల్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా.. ఈ సినిమా టీజర్ రిలీజయ్యింది. టీజర్ ను బట్టి ఈ సినిమా మేకింగ్ ఎంతో విలక్షణంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.