పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఇద్దరితో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సముద్రఖని డైరెక్ట్ చేశాడు. త్రివిక్రమ్ స్క్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.
రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ ఈవెంట్ తో మంచి బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్ సైతం చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సినిమాలో పవన్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నాడని ముందే చెప్పారు. ఇక లేటెస్ట్ గా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ మాష్అప్ వీడియోను ఫ్రెష్ గా రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు, పొలిటికల్ మీటింగ్స్ లోని డైలాగ్స్ తో పాటు త్రివిక్రమ్ అప్పుడప్పుడూ వేదికలపై ఆయన చెప్పిన మాటలను కూడా కలిపి ఈ మాష్ అప్ వీడియోలో ప్రదర్శించారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మాష్ అప్ ను చూసినప్పుడు ఆ అభిమానుల గోల, కోలాహలంలో పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు. అందుకే శ్రేయాస్ మీడియా వాళ్లు ఇలా స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఇందులోని ప్రతి డైలాగ్, షాట్ ఆకట్టుకునేలా ఉన్నాయనే చెప్పాలి.
కాకపోతే ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఇంతకు మించిన పవర్ ఫుల్ సీన్స్, డైలాగ్స్ ఇంకా పవన్ సినిమాల్లో చాలానే ఉన్నాయి. ఇందులో కొన్ని మిస్ చేయొచ్చు. అవి యాడ్ చేయొచ్చు. ఇక జల్సాలోని జైలు డైలాగ్ ప్లేస్ మెంట్ కూడా బాలేదు. బట్ ఓవరాల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే మాష్అప్ ఇది.