పవన్ కళ్యాణ్ దూకుడుగానే ఉన్నాడు.. కానీ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. వరుసగా కొత్త సినిమాలను కరెక్ట్ ప్లానింగ్స్ తో పూర్తి చేసే ప్రయత్నం లో ఉన్నాడు. ఎప్పుడో స్టార్ట్ అయిన హరి హర వీరమల్లును కాదని.. రీసెంట్ గా ఓకే చేసిన తమిళ్ మూవీ వినోదయ సీతాం రీమేక్ ను పూర్తి చేసాడు కూడా. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న భవదీయుడు భగత్సింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది.

ఇక ఇప్పుడు రన్ రాజా రన్, సహా ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో చేస్తోన్న ఓ.జి షూటింగ్ కోసం ముంబై లో చేస్తున్నాడు. ఈ మూవీకి ఒక వారం డేట్స్ ఇచ్చాడు. అయితే అవుట్ ఫుట్ బావుందని అదే ఫ్లో లో మరో వారం షూటింగ్ డేస్ పొడిగించాడు. అలాగే హరి హర వీరమల్లు ను కుడా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. త్వరలోనే ఆ మూవీ కొత్త షెడ్యూల్ కూడా రాబోతోంది. నిజానికి ఇది ఫాన్స్ కు హ్యాపీ న్యూస్. బట్ మరో కోణం లో చూస్తే సంథింగ్ ఫిషి అనిపించక మానదు.


పవన్ ఎన్ని సినిమాలు చేసినా అందరికీ హ్యాపీ. బట్ ఇది ఎలక్షన్ ఇయర్ కదా.. ఇప్పుడు కాస్త అగ్రెసివ్ గా ఉంటేనే ఎన్నికల టైం వరకు జనసేన పార్టీ స్ట్రాంగ్ పోటీ ఇస్తుంది. ఒక రకంగా ఇది క్రుషియల్ టైం కూడా. ఇదే పని గతంలో చేసి అప్పుడే ఒప్పుకున్నా సినిమాలు ఫినిష్ చేసి ఉంది ఉంటే ఆ జోష్ తో పొలిటికల్ మైలేజ్ కూడా పెరిగేదే. పైగా ఇప్పుడు ప్రత్యర్థులు విమర్శల పదును కూడా పెంచారు. వాటికి అదే స్థాయిలో బదులివ్వాలంటే పవన్ జనం లో రెగ్యులర్ గా ఉండాలి. కానీ సినిమాలు చేస్తున్నాడు. ఇది ఫాన్స్ కు ఆనందం తో పాటు ఆందోళనను కూడా ఇస్తోంది. బట్ పవన్ కళ్యాణ్ మార్పు తెస్తాడు అని ఆశించే వారు మాత్రం ఇప్పుడు సైలెంట్ గా సినిమాలు చేయడాన్ని హర్షించడం లేదు అనేది నిజం. ఏదేమైనా ఈ పొలిటిషన్స్ లైఫ్ ఇలాగె ఉంటుందేమో.. ఏదైనా చేసిన విమర్శలే.. చేయకపోయినా విమర్శలే. మరి పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూడాలి.

Related Posts