పవన్ కళ్యాణ్ తెలివైన నిర్ణయం

వారాహి యాత్రతో ఏపి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాడు పవన్ కళ్యాణ్. ఆయన వెళ్లిన చోటల్లా జనం బ్రహ్మరథం పట్టారు. ఈ సారి విమర్శల్లో పదును కూడా పెరిగింది. దీంతో ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టే ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నాడు అనుకున్నారు. బట్ అలాంటిదేం లేదు.వారాహికే కొంత బ్రేక్ ఇచ్చాడు. ఆల్ రెడీ కమిట్ అయిన రెండు సినిమాలను పూర్తి చేసే పని మొదలుపెట్టబోతున్నాడు.

లేటెస్ట్ గా సుజిత్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘ఓ.జి’ మూవీ షూటింగ్ కోసం డేట్స్ కేటాయించాడు. అక్టోబర్ లో 20 రోజులు ఏకధాటిగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. థాయ్ లాండ్ లో జరగబోతోన్న ఈ షెడ్యూల్ మొత్తం పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగే మరో వారం రోజుల షూటింగ్ కోసం నవంబర్ లో డేట్స్ ఇచ్చాడు. ఈ షూటింగ్ తో పవన్ కళ్యాణ్ పోర్షన్ దాదాపు పూర్తవుతుందట.దీంతో పాటు మరో సర్ ప్రైజ్ కూడా వచ్చింది.


ఓజి కంటే ముందే ఒప్పుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మరో షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపొందే ఈ చిత్రం మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తున్నారు. ఆల్రెడీ పూర్తయిన ఒక షెడ్యూల్ తోనే ఫైర్ బ్రాండ్ లాంటి గ్లింప్స్ విడుదల చేశాడు హరీష్. ఇక మరో షెడ్యూల్ ఈ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతోంది.

ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. పవన్ సరసన శ్రీ లీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం చూస్తుంటే ముందు ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే పొలిటికల్ గా బిజీ అవుతాడు అనిపిస్తోంది. ఒక్కసారి ఈ సినిమాల నుంచి ఫ్రీ అయితే పూర్తిగా ఫోకస్ అంతా 2024 ఎన్నికలపై పెటొచ్చు. లేదంటే ఈ సినిమాలకు సంబంధించిన విమర్శలు కూడా ఎదురవుతాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు. ఈ సినిమాలు ఎలెక్షన్స్ కూడా కలిసొస్తాయని వేరే చెప్పక్కర్లేదేమో.

Related Posts