HomeMoviesటాలీవుడ్వరద బాధితుల కోసం పవన్, మహేష్ సైతం

వరద బాధితుల కోసం పవన్, మహేష్ సైతం

-

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సంభవించిన వరదలతో అపార నష్టం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో వరద బాధితులకు అండగా నిలవడానికి ముందుకొస్తున్నారు తెలుగు చిత్ర ప్రముఖులు. ఇప్పటికే వరద బాధితుల కోసం నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు రూ.50 లక్షలు చొప్పున మొత్తంగా కోటి రూపాయల చొప్పున విరాళాలు ప్రకటించారు. ఇంకా.. యువ కథానాయకులు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ సైతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా.. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు చినబాబు, నాగవంశీలు సంయుక్తంగా రూ.50 లక్షలు, వైజయంతీ సంస్థ రూ.25 లక్షలు వరద బాధితుల కోసం ప్రకటించారు.

Mahesh 1

తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళాలు ప్రకటించాడు. ‘రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా.. నేను AP మరియు తెలంగాణ రెండింటికీ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నాను. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి మరియు పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుతున్నాను. మనం ఈ సంక్షోభాన్ని అధిగమించి.. మరింత బలంగా ఎదగాలి.’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు సూపర్ స్టార్.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలన చేశారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇవీ చదవండి

English News