ఏదైనా సినిమా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అయిందంటే అంతా ఆసక్తిగా చూస్తారు. తీసినవారు గర్వంగా ఫీలవుతారు. అక్కడ అవార్డ్ గెలుచుకుందా లేదా అనేకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు నామినేట్ కావడం కూడా విశేషంగానే చెప్పుకుంటారు.
అలా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్(IFFM)కు ఇండియా నుంచి చాలా సినిమాలు నామినేట్ అయ్యాయి. మన దేశ సినిమాలకు సంబంధించి ఇండియా బయట నిర్వహించే ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ ఇదే కావడం విశేషం.
14వ ఎడిషన్ గా వస్తోన్న ఈ ఫెస్టివల్ జ్యూరీకి కొత్త సభ్యుడుగా ఆస్కాన్ విన్నర్ ఆస్ట్రేలియన్ మూవీ మేకర్ బ్రూస్ బెరెస్ చేరాడు. అక్కడ చాలా పాపులర్ అయిన అతని ఎంట్రీతో జ్యూరికి ఓ నిండుదనం వచ్చిందని చెబుతున్నారు.
ఈ ఫెస్టివల్ కు 2022 జూన్ 1 నుంచి 2023 మే 1 మధ్య విడుదలైన సినిమాలను నామినేషన్స్ కోసం పంపించవచ్చు. అలా పంపించబడిన సినిమాల లిస్ట్ ఇది. ఈ లిస్ట్ లో తెలుగు నుంచి సీతారామంతో పాటు కన్నడ నుంచి కాంతార చిత్రాలకు నామినేషన్ లో చోటు దక్కడం విశేషం. మరి వీళ్లు విజేతలుగా నిలుస్తారా లేదా అనేది చెప్పలేం కానీ.. ప్రతిష్టాత్మకమైన ఈ ఫెస్టివల్ లో నిలిచినందుకైనా వారికి అభినందనలు చెప్పాలి.
ఇక ఇండియా నుంచి నామినేట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లు, నటులు, టెక్నీషియన్స్ లిస్ట్ ఇలా ఉంది.
నామినీస్ ఫుల్ లిస్ట్
ఉత్తమ చిత్రం
భేదియా – హిందీ
బ్రహ్మాస్త్రం – హిందీ
డార్లింగ్స్ – హిందీ
జోగి – పంజాబీ
కాంతరా – కన్నడ
మోనికా.. ఓ మై డార్లింగ్ – హిందీ
పఠాన్ – హిందీ
పొన్నియిన్ సెల్వన్ 1 మరియు 2 – తమిళం
సీతా రామం – తెలుగు
ఉత్తమ ఇండీ చిత్రం
ఆత్మ కరపత్రం – మరాఠీ
ఆగ్రా – హిందీ
ఆల్ ఇండియా ర్యాంక్ – హిందీ
కుటుంబం – మలయాళం
గుల్మోహర్ – హిందీ
హడినెలెంటు (సెవెన్టీనర్స్) – కన్నడ
జోరం – హిందీ
పైన్ కోన్ – హిందీ
కథకుడు – హిందీ
తోరా భర్త – అస్సామీ
జ్విగాటో – హిందీ
బెస్ట్ డైరెక్టర్
అనంత్ మహదేవన్ – కథకుడు
అనురాగ్ కశ్యప్ – కెన్నెడీ
ఆశిష్ అవినాష్ బెండే – ఆత్మ-కరపత్రం (ఆటోబయో-కరపత్రం)
దేవాశిష్ మఖిజా – జోరం
డాన్ పాలతర – కుటుంబం
కను బెహ్ల్ – ఆగ్రా
మణిరత్నం – పొన్నియిన్ సెల్వన్ 1 మరియు 2
నందితా దాస్ – జ్విగాటో
పృథివి కోననూర్ – హదినెలెంటు (సెవెన్టీనర్స్)
రిమా దాస్ – తోరా భర్త
సిద్ధార్థ్ ఆనంద్ – పఠాన్
వాసన్ బాలా – మోనికా ఓ మై డార్లింగ్
బెస్ట్ యాక్టర్ ( మేల్)
దుల్కర్ సల్మాన్ – సీతారామం
కపిల్ శర్మ – జ్విగాటో
మనోజ్ బాజ్ పేయి – జోరామ్
మనోజ్ బాజ్ పేయి – గుల్మోహర్
మోహిత్ అగర్వాల్ – ఆగ్రా
పరేష్ రావల్ – కథకుడు
రాజ్కుమార్ రావు – మోనికా ఓ మై డార్లింగ్
రిషబ్ శెట్టి – కాంతారావు
షారుఖ్ ఖాన్ – పఠాన్
విజయ్ వర్మ – డార్లింగ్స్
విక్రమ్ – పొన్యిన్ సెల్వన్ 1 మరియు 2
బెస్ట్ యాక్ట్రెస్ (ఫీమేల్)
ఐశ్వర్య రాయ్ బచ్చన్ – పొన్నియన్ సెల్వన్ 1 మరియు 2
అక్షత పాండవపుర – కోలి ఎస్రు
అలియా భట్ – డార్లింగ్స్
భూమి పెడ్నేకర్ – భీద్
కాజోల్ – సలామ్ వెంకీ
మృణాల్ ఠాకూర్ – సీతా రామం
నీనా గుప్తా – వద్
రాణి ముఖర్జీ – శ్రీమతి ఛటర్జీ Vs నార్వే
సాయి పల్లవి – గార్గి
సన్యా మల్హోత్రా – కథల్
బెస్ట్ వెబ్ సిరీస్
దహాద్
ఢిల్లీ క్రైమ్ సీజన్ 2
ఫర్జి
జూబ్లీ
ఆమె సీజన్ 2
సుజల్: ది వోర్టెక్స్
బ్రోకెన్ న్యూస్
వెబ్ సిరీస్ విభాగంలో ఉత్తమ నటుడు (మేల్)- సిరీస్
అభయ్ డియోల్ – ట్రయల్ బై ఫైర్
అభిషేక్ బచ్చన్ – బ్రీత్ – ఇంటు ది షాడోస్ సీజన్ 2
అపరశక్తి ఖురానా – జూబ్లీ
ప్రోసెన్జిత్ ఛటర్జీ – జూబ్లీ
షాహిద్ కపూర్ – ఫర్జీ
సిధాంత్ గుప్తా – జూబ్లీ
విజయ్ సేతుపతి – ఫర్జీ
విజయ్ వర్మ – దహద్
ఉత్తమ నటి ఫిమేల్)- సిరీస్
రాజశ్రీ దేశ్ పాండే – అగ్ని ద్వారా విచారణ
రసిక దుగల్ – ఢిల్లీ క్రైమ్ సీజన్ 2
షెఫాలీ షా – ఢిల్లీ క్రైమ్ సీజన్ 2
శ్రియా పిల్గావ్కర్ – ది బ్రోకెన్ న్యూస్
శ్రీయా రెడ్డి – సుజల్: ది వోర్టెక్స్
తిలోటమా షోమ్ – ఢిల్లీ క్రైమ్ సీజన్ 2
వామికా గబ్బి – జూబ్లీ
బెస్ట్ డాక్యుమెంటరీ
ఎగైనెస్ట్ ది టైడ్
ధరి లాటర్ రే హోరో – (భూమి కింద తాబేలు)
ఫాతిమా
కుచేయే ఖోష్ బఖ్త్