సినిమాలకు సెన్సారింగ్ ఉంటుంది. అది తెలిసే మేకర్స్ సినిమాలు తీస్తుంటారు. అయినా అభ్యంతరకరం అనిపించిన ఒకటీ అరా సన్నివేశాలు తొలగించడమో.. డైలాగ్స్ ను మ్యూట్ చేయడమో చేస్తుంటారు. మరికొన్నిసార్లు హీరోయిన్లు, ఐటమ్ సాంగ్స్ లోని అందాలపై సెన్సారింగ్ ఉంటుంది.
అయితే ఒక సినిమాకు 27 కట్స్ చెబితే ఇంక సినిమా ఏముంటుందీ.. అది కూడా దేవుడిపై తీసిన సినిమా అయితే.. యస్. అదే జరిగింది. అక్షయ్ కుమార్ హీరోగా ఓ మై గాడ్ అనే హిందీ చిత్రానికి ఈ సీక్వెల్ వస్తోది. ఓమై గాడ్2 అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల చేసేందుకు షెడ్యూల్ అయింది. బట్ సెన్సార్ పరంగా ఎప్పటి నుంచో చిక్కులు వస్తున్నాయి. ఈ సినిమాకు ముంబై, ఢిల్లీతో పాటు అనేక భాషల్లో సెన్సార్ చేస్తున్నారు.
ఈ మూవీ ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ సమస్య పై ఉంటుందట. దేవుడు పాత్ర ఇలాంటి సినిమాలో నటించడం ఏమో కానీ.. ఇప్పుడసలే దేవుళ్ల గురించిన మాటల్నే నానా విధాలుగా వక్రీకరిస్తున్నారు. ఆవేశం పడిపోతున్నారు. ఇక ఏకంగా దేవుడి పాత్రే ఇలాంటి డైలాగ్స్ చెబితే ఊరుకుంటారా.. అందుకే ఎందుకైన మంచిదని ముందే కట్స్ చెప్పేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి 27 కట్స్ చెప్పింది సెన్సార్ బోర్డ్. ఇన్ని కట్స్ లో డైలాగ్స్, సీన్స్ ఉన్నాయట. అవన్నీ కట్ చేసిన తర్వాతే సినిమాకు కొన్ని చోట్ల ‘ఏ’ సర్టిఫికెట్, మరికొన్ని చోట్ల ‘యూ/ఏ’సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు. బట్ ఈ మూవీ రిలీజ్ తర్వాత చాలా వివాదాలు వస్తాయని ఊహిస్తున్నారు కొందరు. వస్తాయా లేదా అనేది ఆగస్ట్ 11న తేలుతుంది.బట్ ఈ సెన్సార్ కట్స్ విషయం మాత్రం సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తెస్తుంది. అన్ని కట్స్ ఎందుకు ఉన్నాయని ఇంట్రెస్ట్ లేని వారు కూడా చూసేలా జరుగుతుందీ వ్యవహారం.