బాలీవుడ్ బడా స్టార్స్ తో ఎన్టీఆర్ పార్టీ

మన టాలీవుడ్ స్టార్స్ రీజనల్ బౌండరీస్ చెరిపేస్తున్నారు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. గ్లోబల్ స్టార్స్ గా అవతరిస్తున్నారు. ఈ లిస్టులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ‘దేవర’తో బిజీగా ఉన్న తారక్.. ‘వార్ 2’తో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో.. ముంబైలో విహరిస్తున్న ఎన్టీఆర్.. అక్కడ తారలతో కలిసి డిన్నర్ పార్టీలు చేసుకుంటున్నాడు.

లేటెస్ట్ గా హృతిక్ రోషన్-సాబా ఆజాద్, రణ్‌బీర్ కపూర్-అలియా భట్ కపుల్స్ తో కలిసి ఎన్టీఆర్ ముంబైలోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కి అటెండ్ అయ్యాడు. ఈ పార్టీలో కరణ్ జోహార్ కూడా ఉన్నాడు. అందుకు సంబంధించి ఫోటోలు ఇప్పుడు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక.. హృతిక్ రోషన్ తో ‘వార్ 2’లో స్క్రీన్ షేర్ చేసుకుంటోన్న ఎన్టీఆర్.. అలియా భట్ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’లో నటించాడు. కరణ్ జోహార్ విషయానికొస్తే.. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాని హిందీలో అతనే రిలీజ్ చేస్తున్నాడు.

Related Posts