ఎన్టీఆర్ – కొరటాల రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది..

యంగ్ టైగర్, కొరటాల శివ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా విషయం ఒక్కొక్కటీ ఓ కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఎన్టీఆరే ఫిక్స్ చేశాడని చెబుతున్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను తన నటనతో మైమరపించాడు. ఆ పాత్రలో పెద్దగా స్టఫ్ లేకపోయినా.. కేవలం నటనతోనే రిజిస్టర్ చేశాడు. ఆ నటన వల్లే ఏకంగా ఆస్కార్ వరకూ వెళ్లిపోయారు మేకర్స్ తో పాటు ఆడియన్స్. ఇదే సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ గానూ మారాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆ రేంజ్ ను పెంచుకునేందుకు ప్యాన్ ఇండియన్ కంటెంట్ కే ప్రాధాన్యంఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అనుకున్న సినిమా ఆగిపోయింది.

అందుకు ప్రధాన కారణం కథే అంటున్నారు. ఆ తర్వాత ఆచార్య వంటి డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివతో సినిమా చేయడానికి రెడీ అయ్యి మరింత ఆశ్చర్యపరిచాడు. బట్ ఈ అవకాశాన్ని శివ అంత సులువుగా అందిపుచ్చుకోలేకపోయాడు.కొరటాల చెప్పిన కథ విషయంలో ఎన్టీఆర్ మొదట అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంకా మార్పులు చెప్పాడు. ఆ మార్పులు చేయడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకుంటున్నాడు. చివరగా ఓ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారట. అయితే ఈ స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ ఇంకా చూడలేదు. ఈ నెల చివరలో పూర్తి కథ వింటాడట. అంతా సెట్ అయితే.. డిసెంబర్ నుంచే చిత్రీకరణ మొదలుపెడతారు. కథ చాలా వరకూ ఓకే అయింది. బౌండ్ స్క్రిప్ట్ వరకూ వచ్చింది కాబట్టి పెద్ద మార్పులు ఉండవు అందుకే టీమ్ ప్రీ ప్రొడక్షన్ ఎప్పుడో స్టార్ట్ చేసింది.

అయితే సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలనేది మొదట అనుకున్న ప్లాన్ అది మారింది కాబట్టి కొత్త రిలీజ్ డేట్ ను సూచించాడు ఎన్టీఆర్.ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 దసరాకు విడుదల చేసేలా టార్గెట్ పెట్టుకుని ఆ మేరకు షూటింగ్స్ అన్నీ ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు కొరటాలకు స్ట్రాంగ్ గా చెప్పాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కంటే ముందు వచ్చిన అరవింద సమేత కూడా దసరాకే విడుదలైంది. అందుకోసం అని కాదు కానీ.. ఈ మొత్తం లేట్ ను దసరా హాలిడేస్ లో క్లియర్ చేయొచ్చనే ఆలోచన కావొచ్చు. మొత్తంగా ఇప్పటికి అఫీషియల్ కాకపోయినా.. ఈ చిత్రం ఖచ్చితంగా వచ్చే యేడాది దసరాకు విడుదలవుతుంది.

Related Posts