NTR Arts : రామ్ చరణ్ రూట్ లో ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కలెక్షన్స్ పరంగా ఈ ఇద్దరు కలిసి కూడా బాహుబలి 2ను బీట్ చేయలేదు కానీ.. క్రేజ్ పరంగా ఇంటర్నేషనల్ లెవల్లో ప్రభాస్ ను మించి ప్రమోషన్స్ తెచ్చుకున్నారు. వాటి ద్వారా వచ్చిన క్రేజ్ తోనే ఇప్పుడు వరుసగా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

వీరి రేంజ్ కు తగ్గట్టుగా అప్పుడప్పుడూ హాలీవుడ్ మూవీస్ కూడా చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.హాలీవుడ్ సంగతి ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ మాత్రం ఫస్ట్ టైమ్ ఓ బాలీవుడ్ మూవీకి రెడీ అవుతున్నాడు. కొరటాల శివతో దేవర పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ తో పాటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్2’ మూవీ చేయబోతున్నాడు.

అయితే ఈ మూవీస్ తోపాటు ఓ కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించబోతున్నాడు యంగ్ టైగర్. అది కూడా రామ్ చరణ్‌ లాగానే. రామ్ చరణ్ తన ఫ్యామిలీ పేరుతో కొణెదల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించాడు.ఈ బ్యానర్ లో ఇప్పటి వరకూ చిరంజీవితోనే సినిమాలు చేశాడు.

అయితే సడెన్ గా మరో కొత్త బ్యానర్ లో భాగస్వామి అయ్యాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఉన్న విక్రమ్ అనే వ్యక్తితో కలిసి ” వి మెగా పిక్చర్స్” అనే బ్యానర్ స్టార్ట్ చేశాడు. ఈ బ్యానర్ లో చిన్న సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన అన్న స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భాగస్వామిగా మారబోతున్నాడు. అయితే ఈ ఇద్దరూ కలిసి మరో కొత్త బ్యానర్ స్టార్ట్ చేస్తారట. ఈ బ్యానర్ లో వీళ్లు కూడా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలకు, కంటెంట్ బేస్డ్ మూవీస్ కు ప్రాధాన్యం ఇస్తూ నిర్మాణం చేయబోతున్నారని టాక్. అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మాత్రం ఎన్టీఆర్ చేసే భారీ సినిమాల్లో భాగస్వామిగా ఉంటుందట. అలా అన్నదమ్ములిద్దరూ కలిసి మరో కొత్త వ్యాపారానికి సిద్ధమవుతున్నారని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

Related Posts