ఆర్ఆర్ఆర్ తో కంట్రీలోనే చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో అందుకు తగ్గ కథలకే ఓటేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా షూటింగ్ లో ఉన్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే దేవర అతని కెరీర్ లోనే మోస్ట్ వయొలెంట్ మూవీగా చెబుతున్నారు.

ఏకంగా ఏడు భారీ ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం అండర్ వాటర్ ఫైట్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ముంబై నుంచి వచ్చిన ట్రెయినర్స్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు ఎన్టీఆర్.

ఇక దీంతో పాటు రీసెంట్ గానే అతను ఫస్ట్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీకి సైన్ చేసి ఉన్నాడు. బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ‘వార్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్న ఈ సినిమాకు వార్2 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ యేడాది చివరి నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ లో అడుగుపెడతాడు. ఈ లోగా దేవరను పూర్తి చేయాల్సి ఉంది. అందుకే వేరే వ్యాపకాలేం పెట్టుకోకుండా కంటిన్యూస్ గా దేవర షూటింగ్ లోనే ఉన్నాడు యంగ్ టైగర్.

ఇంకా షూటింగే స్టార్ట్ కాని వార్ 2 రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అజయ్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని 2025 జనవరి 24న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే వచ్చే యేడాదిలో దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగ్ జరుగుతుంది.

మిగతా టైమ్ పోస్ట్ ప్రొడక్షన్ కు అన్నమాట. ఇంకా హీరోయిన్లు ఎవరు అనేది కన్ఫార్మ్ కాలేదు. కానీ ఇందులో హృతిక్ రోషన్ కబిర్ గా, ఎన్టీఆర్ నజీర్ అనే పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి ఈ యుద్ధభూమిలో విజేత ఎవరో తెలియాలంటే 2025 జనవరి 24 వరకూ వేచి చూడాలన్నమాట.