ఈ ఇస్మార్ట్ బ్యూటీని ఎవరూ పట్టించుకోవడం లేదే..?

ఏ ఇండస్ట్రీలో అయినా ఆఫర్స్ తగ్గిన హీరోయిన్లు హాట్ నెస్ పెంచుతారు. అప్పటి వరకూ అందాలప్రదర్శనకు నో చెప్పిన వాళ్లు కూడా కొత్త అవకాశాల కోసం సరికొత్త షూట్స్ తో సోకులు ఆరబోస్తుంటారు. బట్ కెరీర్ ఆరంభం నుంచీ ఎక్స్ పోజింగ్ కు ఏ అబ్జెక్షన్ చెప్పకపోయినా.. వరుసగా వచ్చిన రెండు మూడు ఫ్లాపులతో వెనకబడిన బ్యూటీ నభా నటేష్‌.

నన్ను దోచుకుందువటే అనే చిత్రంతో తెలుగులో కెరీర్ ఆరంభించిన ఈ బ్యూటీకి ఇస్మార్ట్ శంకర్ తిరుగులేని బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో అమ్మడి నటనకే కాదు.. అందాల ప్రదర్శనకు సైతం ఆడియన్స్ పడిపోయారు. ఏ మాత్రం మొహమాటం లేని ఆమె టాలెంట్ కు ఇక తెలుగులో మంచి ఆఫర్స్ వస్తాయి అనుకున్నారు. వచ్చాయి. కానీ అవేవీ అంతగా ఆకట్టుకోలేదు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ మహరాజ్ రవితేజతో చేసిన డిస్కో రాజా డిజాస్టర్ అయింది. సాయిధరమ్ తేజ్ తో నటించిన సోలో బ్రతుకే సో బెటర్ కొంత బెటర్ అనిపించుకున్నా.. అల్లుడు అదుర్స్ డిజాస్టర్స్ తో ఆడియన్స్ తో పాటు నిర్మాతలు కూడా బెదిరిపోయారు. ఏ మాటకు ఆ మాటే అల్లుడు అదుర్స్ లో అమ్మడు తెలుగు సినిమాలో తమిళ్ అతి లాంటి నటన చూపించి ఇరిటేట్ చేసిందనుకోండి. ఇక చివరగా నితిన్ సినిమా మేస్ట్రోలో మెరిసినా.. ఇది ఓటిటిలో కూడా మెరవలేదు. కట్ చేస్తే సడెన్ గా కనిపించకుండా పోయింది.


నిజానికి నభా నటేష్‌ కు ఆఫర్స్ లేక ఆగిపోలేదు. మేస్ట్రోతర్వాత తనకు ఓ యాక్సిడెంట్ అయింది. లెఫ్ట్ షోల్డర్ ఫ్రాక్చర్ అయింది. ఆ దెబ్బకు యేడాది పాటు రెస్ట్ అవసరం అయింది. అదే టైమ్ లో కోవిడ్ కూడా రావడంతో అటు కనీసం ఫోటో షూట్స్ కూడా లేకుండా పోయాయి. దీంతో నభా ఇక అందుబాటులో ఉండదు అనుకున్నారేమో.. మనవాళ్లెవరూ ఆమెను పట్టించుకోలేదు.


ఇక కొన్నాళ్ల క్రితం తన యాక్సిడెంట్ గురించి చెబుతూ.. సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అయింది. అప్పటి నుంచీ కమ్ బ్యాక్ కోసం అదే పనిగా హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తూనే ఉంది. బట్ ఇప్పటి వరకూ ఒక్క కొత్త ఆఫర్ కూడా రాలేదు. మరి ఇలాగే చేస్తే అమ్మడి అందం ఫోటో షూట్స్ లోనే ఆగిపోయేలా ఉందంటున్నారు. అయినా ఇప్పుడెలాగూ మన సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉంది కదా..? ఆ కొరతను ఇలాంటి బ్యూటీస్ తో తీర్చేయొచ్చు కదా..?

Related Posts