HomeMoviesటాలీవుడ్ఆస్ట్రేలియాలో నితిన్, శ్రీలీల అల్లరి!

ఆస్ట్రేలియాలో నితిన్, శ్రీలీల అల్లరి!

-

నితిన్, శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. తాజాగా ఈ షూటింగ్ సెట్ నుంచి ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Robinhood 1

ఈ వీడియోలో శ్రీలీల అకస్మాత్తుగా ముసుగు వేసుకుని, డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఉంటుంది. ఆమె అల్లరి చూసి నితిన్ అవాక్కయ్యాడు. ఈ సందర్భంగా నితిన్ తన సోషల్ మీడియాలో, ‘ఇది మహిళా లోకం భయ్యా.. చప్పట్లు కొట్టి అభినందించడం తప్ప ఏమీ చేయలేను’ అంటూ కామెంట్ చేశాడు. నితిన్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తున్నాయి.

Nithin And Sreeleela

శ్రీలీల అల్లరికి నితిన్ ఇలా అవాక్కయ్యడం ఇదే మొదటిసారి కాదని, ‘రాబిన్‌హుడ్’ సెట్‌లో ఇలాంటి ఫన్నీ ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటూనే ఉన్నాయని చిత్రబృందం చెబుతున్న మాట. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ తర్వాత నితిన్-శ్రీలీల కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’.

అలాగే.. ‘భీష్మ’ వంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ కుడుమల కలయికలో ఈ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ కేమియోలో మురిపించబోతున్నట్టు వార్తలొచ్చాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. జి.వి.ప్రకాష్‌ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో లేదా.. వచ్చే యేడాది ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవీ చదవండి

English News