తెలుగులో మొదలైన ముహూర్తాల సందడి

జూలై 1 నుంచి తెలుగులో ముహూర్తాల సందడి మొదలైంది. జూలై 1న బెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమాతో పాటు.. నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ మూవీస్ ప్రారంభమయ్యాయి. ఇక.. జూలై 3న వెంకటేష్-అనిల్ రావిపూడి మోస్ట్ అవైటింగ్ హ్యాట్రిక్ కాంబో ముహూర్తాన్ని జరుపుకుంటుంది. అలాగే.. విశ్వక్ సేన్ ‘లైలా’ కూడా జూలై 3న ముహూర్తం పూర్తిచేసుకోబోతుంది.

‘వెంకీఅనిల్3’ అనే హ్యాష్‌ట్యాగ్ తో ప్రచారంలోకి వచ్చిన వెంకటేష్-అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కాంబో మూవీని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎస్.వి.సి. సంస్థలో 58వ చిత్రం. ఎక్స్‌లెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గాళ్‌ఫ్రెండ్ అంటూ ట్రయాంగులర్ లవ్‌స్టోరీగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.

మరోవైపు.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’ అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విశ్వక్ లైలా అనే అమ్మాయి పాత్రలో నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది విశ్వక్ ‘గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Related Posts