HomeMoviesటాలీవుడ్ధనుష్ విషయంలో నయనతార నే తిడుతోన్న నెటిజన్లు!

ధనుష్ విషయంలో నయనతార నే తిడుతోన్న నెటిజన్లు!

-

ప్రముఖ కథానాయిక నయనతార.. మరో ప్రముఖ కథానాయకుడు ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. నయనతార జీవితం ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. నయనతార హీరోయిన్ గా నటించగా ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలోని విజువల్స్ ను ఈ డాక్యుమెంటరీలో వాడారు. దీంతో.. ఆ చిత్ర నిర్మాత ధనుష్ అభ్యంతరం చెబుతూ లీగల్ నోటీసులు పంపించాడు.

‘నానుమ్ రౌడీ దాన్‘ సినిమాలోని విజువల్స్ ను వాడినందుకు గానూ రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని తన లీగల్ నోటీసులో తెలిపాడట ధనుష్. ఈనేపథ్యంలో ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ను షేర్ చేసింది నయనతార. ఈ లేఖలో ధనుష్‌ తన సినిమా విజయం తర్వాత అహంకారానికి గురయ్యాడని ఆరోపించింది. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా తన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని, అయినప్పటికీ ధనుష్‌ తనను అడ్డుకుంటున్నాడని ఆరోపించింది.

అయితే ఈ ఇష్యూపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నయనతారకు సపోర్ట్ చేసినా.. ఈ విషయంపై ధనుష్ కి కూడా భారీగా మద్దతు పెరుగుతుంది. ‘నానుమ్ రౌడీ దాన్‘ సినిమాని కేవలం 6 కోట్లలోనే తీస్తానని మాటిచ్చాడట డైరెక్టర్ విఘ్నేశ్ శివన్. తీరా చూస్తే ఆ సినిమాకి 16 కోట్లు ఖర్చయిందట. మూవీ హిట్ అయినా ధనుష్ కి నష్టాలు వచ్చాయనేది కోలీవుడ్ టాక్.

మరోవైపు నయనతార జీవితం ఆధారంగా రూపొందిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ప్యూర్ కమర్షియల్ డీల్. తన పెళ్లి వేడుకను ఈ డాక్యుమెంటరీ కోసం నయనతార భారీ మొత్తానికి అమ్ముకుందనే ప్రచారం ఉంది. అలాగే ‘నానుమ్ రౌడీ దాన్‘ రైట్స్ నిర్మాత ధనుష్ వద్ద ఉంటాయి కాబట్టి ఆ సినిమాలోని విజువల్స్ వాడాలా? వద్దా? అనేది అతని నిర్ణయానికే వదిలేయాలని కూడా నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ధనుష్ ను విమర్శించే ముందు నయనతార కూడా కొన్ని విషయాలను ఆలోచించాలని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. నయనతార తాను నటించిన సినిమాల ప్రచారలకు వెళ్లదు. ఆ విషయంలో చాలామంది నిర్మాతలు నష్టపోయారని లెక్కలతో సహా బయటపెడుతున్నారు. మొత్తానికి నయనతార-ధనుష్ వివాదం మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇవీ చదవండి

English News