నాని ‘హాయ్ నాన్న’ మేనిఫెస్టో విడుదల

ఈరోజుల్లో ఒక సినిమాని తీయడం ఒకెత్తయితే.. ఆ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. తమ సినిమాలను ఆడియన్స్ కు దగ్గర చేయడానికి మన మేకర్స్ ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తుంటారు. ఇక.. తన సినిమాల పబ్లిసిటీ విషయంలో దర్శకనిర్మాతల కంటే ఎక్కువగా కేర్ తీసుకుంటాడు నేచురల్ స్టార్ నాని. ఈకోవలోనే అప్ కమింగ్ మూవీ ‘హాయ్ నాన్న’ కోసం పబ్లిసిటీలో సరికొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నాడు.

సినిమా విడుదలకు చాలా రోజుల ముందే ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు.. మూడు పాటలు కూడా విడుదలయ్యాయి. లేటెస్ట్ గా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరగడంతో ఇప్పుడు అదే రాజకీయాలను తన సినిమాకోసం వాడుకుంటున్నాడు నాని.

‘రిలీజ్ దెగ్గరలో ఉంది. ఎలక్షన్స్ మధ్యలో వున్నాయి. వాడేయటమే..’ అంటూ ‘హాయ్ నాన్న’ మేనిఫెస్టో పేరుతో పొలిటికల్ లీడర్ లా మారి ఓ పెద్ద స్పీచ్ ఇచ్చాడు నాని. ఇక.. ఈ వీడియోకి ‘మేనిఫెస్టోలు అంటే నోటికొచ్చింది చెప్పేస్తున్నారు అందరూ. నేనూ ఒక రాయి ఏసా’ అంటూ కొటేషన్ పెట్టాడు. పనిలో పనిగా మీ ఓటు ‘హాయ్ నాన్న’కే.. డిసెంబర్ 7న సినిమా చూడండి అంటూ తన సినిమాకి ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నాడు నాని.

Related Posts