ఫ్యాన్ కి క్షమాపణలు చెప్పిన నాగార్జున

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే నాగార్జున.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అందుకు కారణం.. నాగార్జున ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వస్తుండగా.. ఒక అభిమాని సెల్ఫీ అడగడానికి దగ్గరకు వచ్చాడు. అయితే.. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతనిని పక్కకు గెంటేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియోకి వివరణ ఇస్తూ.. ఇది ఇప్పుడే తన నోటీస్ కి వచ్చిందని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని నాగ్ తెలిపాడు. అలాగే.. ఆ జెంటిల్‌మ్యాన్ కి క్షమాపణలు చెబుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కింగ్.

సినిమాల విషయానికొస్తే నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చేస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక.. నాగ్ ప్రతిష్ఠాత్మక వందో చిత్రం గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. త్వరలోనే.. ఆ మూవీని అనౌన్స్ చేస్తాడట.

Related Posts