అక్కినేని నాగా చైతన్య.. ఈ మధ్య వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు చూశాడు. అయితే గత చిత్రాలకంటే రీసెంట్ గా వచ్చిన కస్టడీ గురించే అతను ఎక్కువగా ఫీలయ్యి ఉంటాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో వందకు వెయ్యి శాతం కాన్ఫిడెంట్ గా ఉన్నానని చెబుతూ వచ్చాడు. తను ఓ కథ విన్నవెంటనే దర్శకుడిన హగ్ చేసుకున్న మొదటి సందర్భం కస్టడీకే జరిగిందని చెప్పుకున్నాడు.

తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పోయింది. అయినా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు చైతన్య. ఇంతకు ముందు తనతో ప్రేమమ్ వంటి సూపర్ హిట్, సవ్యసాచి వంటి డిజాస్టర్ తీసిన చందు మొండేటి డైరెక్షన్ లో చైతూ నెక్ట్స్ మూవీ ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కార్తికేయ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన చందు మొండేటి అదే చిత్రానికి సీక్వెల్ గా తీసిన కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారాడు. ఈమూవీ ఏకంగా వంద కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. కార్తికేయ2 తర్వాత చందు మరో ప్రాజెక్ట్ కు కమిట్ కాలేదు.

నాగ చైతన్యతోనే సినిమా చేయాలని కథ రాసుకుని ఇప్పటికే రెండు మూడు సార్లు కథ వినిపించాడట. ఈ వారంలోనే ఫైనల్ నెరేషన్ ఉంటుందంటున్నారు. అంతా సెట్ అయితే ఈ మూవీని గీతా ఆర్ట్స్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తారు. మరి ఈ మూవీతో ఈ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

, , , , , , , , , , ,