కేవలం మూడంటే మూడు సినిమాలతో ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు నాగ్ అశ్విన్. ఇప్పటివరకూ తాను దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 1‘ చిత్రాలు తన హోమ్ ప్రొడక్షన్ వంటి వైజయంతీ మూవీస్ లోనే వచ్చాయి. అయితే.. ఈ సారి వైజయంతీ నుంచి బయటకు వచ్చి.. మరో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఏ.వి.ఎమ్. స్టూడియోస్ లో కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు నాగ్ అశ్విన్.
నాగ్ అశ్విన్-ఏ.వి.ఎమ్. స్టూడియోస్ నిర్మాణంలో రూపొందే ‘ప్రాజెక్ట్ ఎస్‘ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్స్ కావాలంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈనేపథ్యంలో.. ఏ.వి.ఎమ్. లో నాగ్ అశ్విన్ కొత్త సినిమా చేయబోతున్నాడు అనేది కన్ఫమ్ అయ్యింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే.. ‘కల్కి‘ సీక్వెల్ గా రావాల్సిన ‘కల్కి 2‘ సంగతేంటి? అనేదే ఇప్పుడు రెబెల్ ఫ్యాన్స్ ను కలవర పెడుతోన్న ప్రశ్న.
‘కల్కి‘ సీక్వెల్ కి సంబంధించి ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందట. అయితే.. మిగతా 40 శాతం షూటింగ్ పూర్తి చేయడానికి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడానికి కనీసం సంవత్సరం సమయం అయినా పడుతోంది. మరి.. ‘కల్కి 2‘ పూర్తవ్వకుండానే.. ఏ.వి.ఎమ్. తో ‘ప్రాజెక్ట్ ఎస్‘కి ఎందుకు కమిట్ అయ్యాడు? అనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
మరోవైపు.. ‘సలార్ 1‘ తర్వాత ‘సలార్ 2‘ని పక్కన పెట్టేశాడు రెబెల్ స్టార్. ప్రస్తుతం మారుతి తో ‘రాజా సాబ్‘, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి‘, సందీప్ రెడ్డి వంగా తో ‘స్పిరిట్‘ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. మరి.. ‘సలార్ 2‘ తరహాలోనే ‘కల్కి 2‘ని కూడా ప్రభాస్ నెగ్లెక్ట్ చేస్తున్నాడా? అందుకే.. నాగ్ అశ్విన్ కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేయబోతున్నాడా? అనే సందేహాలు వస్తున్నాయి. ఏదేమైనా.. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ ఎస్‘కి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయేమో చూడాలి.