HomeMoviesటాలీవుడ్‘కల్కి‘ కోసం నాగ్ అశ్విన్ చేసిన ప్రయోగం

‘కల్కి‘ కోసం నాగ్ అశ్విన్ చేసిన ప్రయోగం

-

తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకుల్లో దర్శకధీరుడు రాజమౌళి ముందు వరుసలో నిలుస్తాడు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే.. జక్కన్న వేసిన బాటలో తెలుగు సినిమా సత్తాను పాన్ వరల్డ్ రేంజుకి తీసుకెళ్లే మరో దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ‘కల్కి‘ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ఏ పెద్ద హాలీవుడ్ సినిమాకీ తీసిపోని రీతిలో ఉన్నాయి. కంటెంట్ పరంగానూ ‘కల్కి‘ ఓ ప్రభంజనమే సృష్టించబోతుందనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

అంతకుముందు కేవలం రెండు సినిమాల అనుభవమే ఉన్నా.. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు నాగ్ అశ్విన్. ‘మహానటి‘ కోసం మలయాళీ నటులైన దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ లతో తెలుగులో డబ్బింగ్ చెప్పించాడు. అప్పట్లో అది సాహసమే అన్నారు. కానీ.. సినిమా విడుదలైన తర్వాత ‘మహానటి‘కి వారి డబ్బింగ్ బాగా ప్లస్ అయ్యింది.

ఇప్పుడు ‘కల్కి‘ విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, కమల్ హాసన్ తెలుగులో సొంత డబ్బింగ్ చెప్పుకున్నారు. ట్రైలర్ లో అది స్పష్టంగా వినిపించింది. మొత్తానికి.. లేటెస్ట్ గా రిలీజైన ‘కల్కి‘ ట్రైలర్ తో కథ విషయం గురించి పెద్దగా క్లారిటీ రాకపోయినా.. ఈ సినిమా నుంచి రిలీజయ్యే మరో ట్రైలర్ తో అన్ని అపొహలు పటాపంచలు అవుతాయని భావిస్తోంది టీమ్. జూన్ 27న ‘కల్కి‘ విడుదలకు ముస్తాబవుతోంది.

ఇవీ చదవండి

English News