కళ్లు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించటమే కాదు, ప్రమాదాల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది. తెలుగు చిత్ర సీమకు చెందిన సీనియర్ నటుడు మురళీ మోహన్ మేకప్ మ్యాన్ కొల్లి రాము సోదరి పమిడి ముక్కల రాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం కన్నుమూశారు.
ఈ విషయాన్ని వారు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి చేరవేయగా వెంటనే వారు స్పందించారు. అలా రాజ్యలక్ష్మిగారు తాను చనిపోయినప్పటికీ నేత్రదానం చేయటం ద్వారా మరో ఇద్దరికీ చూపును అందించి ఎందరికో ఆదర్శప్రాయంగా మారారు. ఈ సందర్భంగా మురళీమోహన్గారికి, కొల్లి రాము ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ సభ్యులు ధన్యవాదాలను తెలియజేశారు.