మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ వస్తోంది

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో అనేక డేట్స్ అనుకున్నారు. చివరికి సెప్టెంబర్ 7న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

అన్ని డేట్స్ మారాయి కాబట్టి ఈ డేట్ అయినా నిజమేనా అనే డౌట్స్ ఆడియన్స్ లో ఉన్నాయి. ఆ డౌట్స్ అక్కర్లేదు అని చెప్పేందుకు ట్రైలర్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ కు తెరలేపుతున్నారు. ట్రైలర్ వస్తే ఆ తర్వాత ప్రమోషన్స్ కు కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. అందుకే ముందుగా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ఈ నెల 21న డేట్ లాక్ చేసుకున్నారు.


ఈ నెల 21న సోమవారం రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. మరి ట్రైలర్ కూడా అన్ని భాషల్లో ఒకేసారి వస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఈ ట్రైలర్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం వెళ్లబోతున్నారు.

అనుష్కకు దేశమంతా పాపులారిటీ ఉంది. ఇటు నవీన్ కు తెలుగుతో పాటు హిందీలో చాలా గుర్తింపే ఉంది. అందువల్ల ఈ రెండు భాషల్లో మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. మిగతా భాషల బాధ్యత అనుష్క తీసుకుంటుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందు ప్రభాస్ నుంచి ఏదైనా ట్వీట్ చేయించగలిగితే మరింత మైలేజ్ వస్తుంది. మొత్తంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7న ఖాయంగా వస్తుందన్నమాట.

Related Posts