HomeMoviesటాలీవుడ్హారర్ బాట పడుతోన్న మెగా ప్రిన్స్

హారర్ బాట పడుతోన్న మెగా ప్రిన్స్

-

మన తెలుగు హీరోలు హారర్ సినిమాలంటేనే ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ పేరుతో ఓ హారర్ కామెడీ చేస్తున్నాడు. దీంతో.. మిగతా హీరోలు కూడా హారర్ జానర్ వైపు దృష్టి పెడుతున్నారు. లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ హారర్ కామెడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

‘మట్కా’ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు వరుణ్. ఈ మూవీ ఆద్యంతం హారర్ జానర్ లోనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ సినిమాకోసం రాయలసీమ యాసను నేర్చుకోనున్నాడట వరుణ్ తేజ్. అందుకోసం వర్క్‌షాప్స్ లోనూ పాల్గొంటాడట.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు మేర్లపాక గాంధీ. సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత శర్వానంద్ తో చేసిన ‘ఎక్స్‌ ప్రెస్‌ రాజా’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నానితో ‘కృష్ణార్జున యుద్ధం’, నితిన్ తో ‘మాస్ట్రో’ కూడా ఫర్వాలేదనిపించాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో హారర్ జానర్ లో పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు మేర్లపాక. త్వరలోనే.. వరుణ్-మేర్లపాక మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.

ఇవీ చదవండి

English News