Mega fans Nandamuri fans : మెగా ఫ్యాన్స్ అలా.. నందమూరి ఫ్యాన్స్ ఇలా..

హీరోలను బట్టి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫ్యాన్స్ కు భిన్నంగా కూడా హీరోలుంటారు అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో కనిపిస్తున్న మెగా – నందమూరి హీరోలు అభిమానులను చూస్తుంటే అర్థం అవుతుంది. నిజం.. ఇక్కడ హీరోలు ఒకరంగా ఉంటే అభిమానులు మరో రకంగా ఉంటారు. ఈ తరహా ఫ్యాన్స్ బహుశా ఇండియాలో ఇంకే ఫ్యామిలీ హీరోస్ కూ ఉండరేమో. మరి మెగా – నందమూరి ఫ్యాన్స్ మధ్య ఉండే వైరుధ్యాలు, వైవిధ్యాలు ఏంటనేది చూద్దాం.


టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో నందమూరి ఒకటి. అయితే ఈ హీరోలు ఎప్పుడూ కలిసి ఉండరు. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్ అంటూ ఉన్నా.. ఈ హీరోలు కలిసి ఒకే వేదికపై రావడానికి ఇష్టపడటం లేదు. అందుకు ఈ మధ్య కాలంలోనే అనేక ఉదాహరణలున్నాయి. అయితే ఈ సంఘటనల తర్వాత అభిమానుల మధ్య చీలకలు వస్తాయి అని చాలామంది భావించారు.

బట్.. నందమూరి హీరోలు విడిపోయి ఉన్నా.. ఫ్యాన్స్ విడిపోకపోవడం విశేషం. అభిమానుల మధ్య చిన్న చిన్న మాటలు ఎక్సేంజ్ అవుతున్నాయి తప్ప.. భారీగా గొడవలు పెట్టుకుని విడిపోతున్నది లేదు. అంటే హీరోలు కొట్టుకుంటున్నా .. ఫ్యాన్స్ మాత్రం కలిసి కట్టుగానే ఉంటున్నారన్నమాట. మరి ఆ హీరోలు కూడా కలిసి ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.


అయితే నందమూరి హీరోలు, ఫ్యాన్స్ కు భిన్నంగా మెగా టీమ్ కనిపిస్తుంది. ఇక్కడ మెగా హీరోలంతా కలిసే ఉంటారు. కానీ అభిమానులు మాత్రం విడిపోతారు. ఈ ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ రూపంలో నలుగురు టాప్ హీరోలున్నారు. మీడియంలో మరో నలుగురు కనిపిస్తారు. ఈ నలుగురును తీసేస్తే.. టాప్ ఫోర్ లో ఉన్న నలుగురు హీరోల్లో చిరంజీవి, రామ్ చరణ్‌ ఫ్యాన్స్ సెపరేట్ గా ఉంటారు. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ వేరే ఉంటారు. అలాగే అల్లు అర్జున్ అభిమానులూ వీరితో కలవరు.

విశేషం ఏంటంటే ఈ నలుగురు హీరోల అభిమానులు అదే ఫ్యామిలీలోని ఇతర హీరోలను టార్గెట్ చేస్తుంటారు. అప్పుడప్పుడూ దారుణమైన ట్రోల్స్ వాళ్లల్లో వాళ్లే చేసుకుంటారు కూడా. అఫ్‌ కోర్స్ మళ్లీ ఇతర హీరోల ఫ్యాన్స్ ఎంటర్ అయితే మళ్లీ కలిసిపోతారు. అది వేరే. బట్ మెగా హీరోలు మాత్రం ఏ చిన్న అకేషన్ ఉన్నా.. కలుస్తుంటారు. హ్యాపీగానే ఉంటారు. బట్ ఫ్యాన్స్ కలవడం లేదు.

సింపుల్ గా చెబితే.. నందమూరి హీరోలు కలవరు.. అభిమానులు కలిసి ఉంటారు..
మెగా హీరోలు కలిసి ఉంటారు.. అభిమానులు విడిపోయి ఉంటారు అన్నమాట.

Related Posts