“ME 4 Tic Tic” యాప్ ‘టిక్ టాక్’ ను మరిపించేస్తాది

ప్రస్తుత జీవితంలో మనందరికీ సోషల్ మీడియా అనేది తప్పనిసరి అయ్యింది. ఎక్కడో చిన్న పల్లెటూరు లో ఉన్న వారు సైతం ఒక వైపు చదువుకుంటూ, మరో వైపు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం “టిక్ టాక్” ను బ్యాన్ చేసింది. ఆ తరువాత యువత తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడానికి మరో ఆల్టర్నేట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా “రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC” సంస్థ వారు “ME 4 Tic Tic” యాప్ ను హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖులు మరియు యువత సమక్షంలో ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. టిక్ టాక్ లేక ఇబ్బంది పడుతున్న ట్యాలెంటెడ్ యూత్ కు ‘ME 4 టిక్ టిక్’ యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. ఈ “ME 4 టిక్ టిక్” యాప్ కు రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్. ఇండియా విభాగానికి డి.సతీష్ రెడ్డి గారు CEO గా వ్యవహరిస్తున్నారు.
ఈ యాప్ లాంచ్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి, సినీ జోష్ వెబ్ సైట్ సీ ఈ ఓ రాంబాబు పర్వతనేని, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పీ ఆర్ ఓ ఆర్.డి.ఎస్ ప్రకాష్ ల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది.
“ME 4 Tic Tic” యాప్ ఇండియా CEO, డి.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యాప్ అయిన “ME 4 Tic Tic ” ను మీడియా సమక్షంలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ “రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC” కంపెనీ వారి ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న చైనా యాప్ లో సెక్యూరిటీ ప్రాబ్లెమ్ ఉన్నందు�