ఆర్జీవి ని ఆకాశానికెత్తేసిన మనోజ్ బాజ్‌పాయి

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మది ప్రత్యేక స్థానం. అవధుల్లేని ఆలోచనాసరళి.. విలక్షణమైన వ్యక్తిత్వం.. వివాదాలంటే ప్రియత్వం వంటి విషయాలు.. వర్మను మిగతా దర్శకుల్లోకి ప్రత్యేకంగా నిలుపుతాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా.. తన సినిమాలతో ఎంతోమంది యువ దర్శకులను ప్రభావితం చేశాడు రామ్ గోపాల్ వర్మ.

వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన కృష్ణవంశీ, గుణశేఖర్, తేజ, పూరి జగన్నాథ్ వంటి వారు.. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులుగా ప్రూవ్ చేసుకున్నారు. వీళ్లే కాకుండా.. బాలీవుడ్ లోనూ ఎంతోమంది దర్శకులు.. వర్మ స్కూల్ నుంచి వచ్చిన వారున్నారు. అలాగే.. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎంతోమంది నటీనటులు వర్మ కాంపౌండ్ నుంచి వచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అలాంటి వారిలో జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పాయి ఒకడు.

లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ గురించి మనోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘ముంబై ఇండస్ట్రీ ను ఒక నార్త్ ఇండియన్ కానీ.. లోకల్ గా ఉన్న వాళ్ళు కానీ ఎవరూ మార్చలేదని..

హైదరాబాద్ నుండి వచ్చిన రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి బాలీవుడ్ ను సింగిల్ హ్యాండ్ తో ఛేంజ్ చేశాడని వర్మని ఆకాశానికెత్తేశాడు మనోజ్ బాజ్‌పాయి. ‘వర్మ ఎవ్వరికీ భయపడడని.. ఇప్పటికీ అతను అదే పద్ధతిలో సాగుతున్నాడని’ మనోజ్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

Related Posts