HomeMoviesటాలీవుడ్మంచు అవ్రామ్ ఫస్ట్ లుక్ అదరహో..!

మంచు అవ్రామ్ ఫస్ట్ లుక్ అదరహో..!

-

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. డిసెంబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న ఈ భక్తిరస చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం ఈ సినిమాలో కనిపించబోతున్న నటీనటులే అని చెప్పొచ్చు. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ వంటి వారు ఈ చిత్రంలో కేమియోస్ లో మురిపించబోతున్నారు. ఆమధ్య విడుదలైన ‘కన్నప్ప‘ టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇటీవలే వరుసగా ‘కన్నప్ప‘ చిత్రంలో నటిస్తున్న నటీనటులకు సంబంధించి ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ వస్తోంది టీమ్. లేటెస్ట్ గా ఈ మూవీలో మంచు వారి మూడో తరం వారసుడు అవ్రామ్ పోషిస్తున్న పాత్రను రివీల్ చేశారు.

Image 229

మంచు మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు తనయుడైన అవ్రామ్ భక్త మంచు ‘కన్నప్ప‘ సినిమాలో యువ తిన్నడు గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో తిన్నడు పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నాడు. అతని చిన్నప్పటి పాత్రనే అవ్రామ్ చేస్తుండడం విశేషం. ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అవ్రామ్ పోషిస్తున్న యువ తిన్నడు పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను మోహన్ బాబు సోషల్ మీడియాలో రివలీజ్ చేశారు. చిన్నప్పటి తిన్నడుగా అవ్రామ్ లుక్ ఆకట్టుకుంటుంది.

ఇవీ చదవండి

English News