Mahi v raghava : సైతాన్ ట్రైలర్.. బోల్డ్, వయొలెంట్

ప్రతి దర్శకుడికీ ఓ శైలి ఉంటుంది. ఆ శైలిని బట్టే ఆడియన్స్ అతని సినిమాలకు ప్రిపేర్ అవుతారు. కానీ ప్రతి సినిమాతోనూ ఓ కొత్త స్టైల్ ను చూపించే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి వారి లిస్ట్ లోకి ఖచ్చితంగా వస్తాడు మహి వి రాఘవ. ఫస్ట్ మూవీ పాఠశాల.

ఆ కాలంలోని గ్నాపకాలను తట్టి లేపుతూ సాగే కథ. కానీ ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత చేసిన ఆనందో బ్రహ్మ హారర్ మూవీస్ లో వైవిధ్యమైన కంటెంట్ తో వచ్చింది. కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది. అటుపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర స్ఫూర్తితో ”యాత్ర” అనే మూవీ చేసి మరో విజయం అందుకున్నాడు.

యాత్ర తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు మహి వి రాఘవ. అయితే రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిన సేవ్ ద టైగర్స్ అనే సిరీస్ ను నిర్మించాడు. ఇదీ విజయం సాధించింది. ప్రస్తుతం అతను అదే డిస్నీ ప్లస్ కోసం ”సైతాన్” అనే ఓ వెబ్ సిరీస్ రూపొందించాడు. ఈ నెల 15నుంచి స్ట్రీమ్ కాబోతోన్న ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది పూర్తిగా అతను ఇప్పటి వరకూ చేయని కంటెంట్. అంటే ఐదో ప్రయత్నంతో ఐదో జానర్ ను టచ్ చేస్తున్నాడన్నమాట.


సైతాన్ ట్రైలర్ చూస్తే తెలుగులో వస్తోన్న బోల్డ్ అటెంప్ట్ గా కనిపిస్తోంది. దర్శకుడు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ఇది కొంతమంది సైకో కిల్లర్ కు కసంబంధించిన కథలా కనిపిస్తోంది. ఆ ముఠా అంతా కలిసి చేసే హత్యలు భయానకంగా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే సీన్ తెలుగులో ఊహించలేనిది. అలాగే ఓ వేశ్య కథ కూడా కనిపిస్తోంది. ట్రైలర్ ఆరంభంలోనే రక్తం చిందించిన దర్శకుడు మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశాడు. మనలో ఒకరిని కాపాడుకోవడం కోసం.. ఎవరినైనా ఎంతమందినైనా చంపాల్సిందే అనే లైన్ ఆధారంగా సిరీస్ లో కొన్ని కథలు సాగేలా ఉన్నాయి.

హత్యలు ఎంత భయానకంగా ఉన్నాయో.. బూతులూ అంతే యధేచ్ఛగా ఉన్నాయి. ఓ రకంగా తెలుగులో తెలుగువాళ్లెవరూ ఈ తరహా వెబ్ సిరీస్ ఇప్పటి వరకూ తీయలేదు.. అనేలా ఉందీ ట్రైలర్ చూస్తే. మరి ఓవరాల్ కంటెంట్ ఎలా ఉంటుందో కానీ.. మహి వి రాఘవ మాత్రం ఒక వయొలెంట్ బోల్డ్ అటెంప్ట్ తో వస్తున్నట్టు కనిపిస్తోంది.

Related Posts