SSMB-28 : మహేష్‌ బాబు – త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేస్తోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ టైటిల్ రాబోతోంది.

అంతా ఊహించినట్టుగానే.. సూపర్ స్టార్ కృష్ణగారి మొదటి జయంతికి టైటిల్ చెప్పబోతున్నాడు మహేష్‌ బాబు. మామూలుగా ప్రతి యేడాది కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటాడు మహేష్‌ బాబు. అది కూడా తండ్రి సమక్షంలోహ్యాపీగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని మరీ చేస్తుంటాడు. ఫస్ట్ టైమ్ ఆయన లేకుండానే మహేష్‌ మూవీ నుంచి అప్డేట్ రాబోతోంది. అయితే ఈ అప్డేట్ విషయంలో సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

మహేష్‌- త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన అతడు, ఖలేజా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా ఓ బ్లాక్ బస్టర్ తోనే రావాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకే స్టోరీ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మరీ ప్లాన్ చేసుకున్నారు. అందుకే అనుకున్న టైమ్ కంటే లేట్ గా విడుదల కాబోతోందీ మూవీ. ఇక ఈ చిత్రం టైటిల్ విషయంలో ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి.

అందులోప్రధానంగా వినిపించినవి రెండు..
“అమరావతికి అటు ఇటూ”, “గుంటూరు మిర్చి”.. ఇవీ టైటిల్స్. బట్ త్రివిక్రమ్ కు ‘అ’ అక్షరం సెంటిమెంట్ కాబట్టి అమరావతికే ఓటు వేయొచ్చు. లేదా ఇప్పటి వరకూ ప్రచారం అయినవి కాకుండా అ అక్షరంతోనే మొదలయ్యే మరో టైటిల్ కూడా రావొచ్చు.


మొత్తంగా మహేష్‌ బాబు సరసన పూజాహెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలోనటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

హారిక హాసిని బ్యానర్ లో రాబోతోన్న ఈ చిత్రం 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయబోతున్నారు.

Related Posts