మహేష్‌ బాబు మళ్లీ జంప్..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబును కొంతమంది వెకేషనల్ స్టార్ కూడా సరదాగా అంటుంటారు. ఆయనలా విదేశీ టూర్స్ వేరే హీరోలు ఇండస్ట్రీలోనే ఎవరూ లేరు. బహుశా దేశంలోనే ఉండరేమో. ఆ రేంజ్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళుతూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు మహేష్‌ బాబు.

కాకపోతే ఈ టూర్స్ అన్నీ సినిమాలు సెట్స్ లో ఉండగా కూడా సాగుతుంటాయి. అది నిర్మాతలకు ఇబ్బందిగా ఉంటుంది. బట్.. ఏమీ అనలేరు కదా..? ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ విషయంలో మహేష్‌ ఇంతకు ముందెప్పుడూ లేనంత నిర్లక్ష్యంగా ఉంటున్నాడు.

ఆయన వల్లే ఈ సినిమా ఇంత లేట్ అవుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికే ఓ కథను వద్దనేశాడు. రెండో కథకు సంబంధించి అనేక కండీషన్స్ పెట్టాడు. సరైన టైమ్ కు షూటింగ్ కు వెళ్లడం లేదట. ఇచ్చిన డేట్స్ ను ఫాలో కావడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. తనతో కాంబినేషన్ సీన్స్ ఉన్నదంతా పెద్ద ఆర్టిస్టులతోనే. ఈయన వల్ల వారి డేట్స్ కూడా వృథా అవుతున్నాయని నిర్మాత వాపోతున్నారు.


ఇప్పుడు కూడా రీసెంట్ గానే గుంటూరు కారం షెడ్యూల్ స్టార్ట్ అయింది. నిన్న సండే అయినా ఒకట్రెండ్ సీన్స్ లో నటించాడు. తర్వాత మళ్లీ వెకేషన్ కు వెళ్లిపోయాడు. మరి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ.. మహేష్‌ తీరు వల్ల విసిగిపోయే.. త్రివిక్రమ్ ఆ మధ్య అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం గుంటూరు కారం స్క్రిప్ట్ పక్కాగా ఉంది కాబట్టి.. హీరో వెకేషన్ కు వెళ్లినప్పుడల్లా.. అల్లు అర్జున్ సినిమా కథ ప్రిపేర్ చేసుకుంటున్నాడట. అలా ఓ స్టార్ వల్ల మరో స్టార్ కు మంచి కథ రెడీ అవుతుందనుకోవచ్చు.

Related Posts