HomeMoviesటాలీవుడ్అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై స్పందించిన 'మా'

అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై స్పందించిన ‘మా’

-

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ వర్గం నుండి తీవ్ర స్పందన వస్తోంది. ప్రభాస్‌ను ఉద్దేశించి అర్షద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రేక్షకులను, ప్రత్యేకంగా ప్రభాస్ అభిమానులను బాధపెట్టాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. బాలీవుడ్ లో సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశారు.

విష్ణు తన లేఖలో, ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉంటుందని అంగీకరిస్తూనే.. అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గం మరియు ప్రభాస్ అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. సోషల్ మీడియా యుగంలో ఒక్క మాట కూడా పెద్ద వివాదానికి దారితీస్తుందని గుర్తుచేస్తూ.. పబ్లిక్ ఫిగర్లు తమ మాటలపై జాగ్రత్త వహించాలని విష్ణు కోరారు.

ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ‘కల్కి’దే మొదటి స్థానం. టాలీవుడ్ టు బాలీవుడ్ అందరి ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘కల్కి’ చిత్రం తనకు నచ్చలేదని ఓ ఇంటర్యూలో తెలిపాడు అర్షద్ వార్సి. అదే సమయంలో ‘కల్కి’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నచ్చిందని.. ప్రభాస్ పాత్ర మాత్రం తనకు ఓ జోకర్ లా అనిపించిందని అన్నాడు అర్షద్ వార్సి.

అర్షద్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజులో దుమారం రేగుతోంది. చాలామంది టాలీవుడ్ యాక్టర్స్ అర్షద్ ని ఓ ఆటాడుకుంటున్నారు. బాలీవుడ్ లో అసలు సిసలు జోకర్ అంటే అర్షద్ వార్సి యేనని.. అతను ఇప్పటివరకూ చేసింది అలాంటి కామెడీ క్యారెక్టర్స్ మాత్రమేనని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ‘మా’ ప్రెసిడెంట్ ఈ విషయంపై బాలీవుడ్ సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి లేఖ రాయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి

English News